స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2020-08-11T10:32:02+05:30 IST
జిల్లాలో ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్..

కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు(కలెక్టరేట్); ఆగస్టు 10 :జిల్లాలో ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశపు హాలులో పలుశాఖల అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లడారు. పోలీస్ పరెడ్ గ్రౌండ్లో జరిగే ఈ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకు అవసరమైన గ్రౌండ్‌ను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు భౌతిక దూరం పాటించే విధంగా సీటింగ్ వేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకట మురళీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించిన జేసీ
సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ వెంకట మురళీ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేయాల్సిన పలు అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. జేసీ వెంట డీఆర్వో కృష్ణవేణి, ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.