2021 నాటికి వెలిగొండకు పూర్తి

ABN , First Publish Date - 2020-11-21T05:43:45+05:30 IST

పశ్చిమ ప్రాంతం ప్రజల ఆశలసౌధం, జలప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం 2021 ఆగస్టు 31 నాటికి పూర్తి చేసి కృష్ణా జలాలను అందించనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

2021 నాటికి వెలిగొండకు పూర్తి
మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఇంజనీరింగ్‌ విభాగ అధికారుతో సమీక్ష


పెద్ద దోర్నాల, నవంబరు 20 : పశ్చిమ ప్రాంతం ప్రజల ఆశలసౌధం, జలప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం 2021 ఆగస్టు 31 నాటికి పూర్తి చేసి కృష్ణా జలాలను అందించనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులపై స్థానిక వెలిగొండ విశ్రాంత భవనంలో ఇంజనీరింగ్‌, రెవెన్యూ శాఖాధికారులతో శుక్రవారం కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆ శాఖాధికారులు వివరించా రు. అనంతరం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ విలేకరులతో మాట్లాడుతూ మొద టి సొరంగం పనులు కేవలం 160 మీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉంద న్నారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషను విడిభాగాలు బయటకు తరలించేందుకు నెలల సమయం పడుతుందన్నారు. ప్రధానంగా హెడ్‌ రెగ్యులేటరు పను లు చేపట్టేందుకు కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఉండడంతో పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. రెండవ సొరంగం కోసం ఇంకా 7.3 కిలోమీటర్ల తవ్వకం జరపాల్సి ఉందన్నారు. డిసెంబరు నాటికి మొదటి సొరంగం పనులు, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయాలని, లింక్‌ కెనాల్స్‌, ఫీడర్‌ కెనాల్స్‌, పునరావాస కేంద్రాలు పూర్తి చేయాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి, కాలువల నిర్మాణాలకు అవసరమయ్యే భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.సమస్యలను అధిగమించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్‌ భాస్కర్‌ వివరించారు.  కార్యక్రమంలో ఎస్‌ఈ నగేశ్‌, భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ సరళవందనం, మార్కాపురం ఆర్‌డీవో శేషిరెడ్డి, ప్రాజెక్టు ఈఈలు ఆబూతాలిమ్‌, చిన్నబాబు, ప్రభాకర్‌, డీఈలు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌, మల్లికార్జునరావు, విద్యాసాగర్‌, పూర్ణచంద్రారావు, మెగా ప్రతినిధి సైదారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T05:43:45+05:30 IST