నాడు- నేడు పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-29T05:21:33+05:30 IST

జిల్లాలో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.

నాడు- నేడు పనులు వేగవంతం చేయాలి

 కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 28: జిల్లాలో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా  పూర్తిచేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో పలు శాఖల అధికారులతో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు, నాడు నేడు, జలజీవన్‌ మిషన్‌ పథ కాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల మరమ్మతుల పనులు, ప్రహరీ గోడల నిర్మాణ పనుల్లో పురోగతి ఉండాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, వివిధ శాఖల అధికారులు శీనారెడ్డి, కొండయ్య, మర్దన్‌ ఆలీ, వీఎస్‌ సుబ్బా రావు, శ్రీనివాసరెడ్డి, శ్రీరామమూర్తి, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, డాక్టర్‌ రత్నావళి, లక్ష్మీదేవి, జీవీ నారాయణరెడ్డి, అంజల  పాల్గొన్నారు. 

ఆధునీకరణ పనులను  పూర్తిచేయాలి

రైతు భరోసా కేంద్రాల జిల్లా వన రుల కేంద్రంలో ఆధునీకరణ పనులు ఉగాది నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక భాగ్యనగర్‌లోని వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 లక్షలతో చేపడుతున్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు.  కార్యక్రమంలో జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, ఆత్మ పీడీ అన్నపూర్ణ, మునిసిపల్‌ ఇంజనీర్‌ సుందరరామిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:21:33+05:30 IST