చికెన్‌ వ్యాపారులకు ఊరట

ABN , First Publish Date - 2020-03-30T10:16:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి, చికెన్‌కు ఏమాత్రం సంబంధం లేదని ప్రజలు గుర్తించారు. వారం, పది రోజుల

చికెన్‌ వ్యాపారులకు ఊరట

మళ్లీ ఊపందుకున్న కొనుగోళ్లు   

పలుచోట్ల బారులు 


ఒంగోలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తికి, చికెన్‌కు ఏమాత్రం  సంబంధం లేదని ప్రజలు గుర్తించారు. వారం, పది రోజుల క్రితం వరకూ ఇందుకు సంబంధించి ఉన్న అనుమానాలు, అపోహలకు తెరదించారు. ఆదివారం జిల్లాలో చికెన్‌ కొనుగోలు భారీగా జరిగింది. దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో చికెన్‌ వ్యాపారులకు ఊరట లభించింది. 


కరోనా వైరస్‌ ప్రభావంతో కోళ్ల పరిశ్రమ కుప్పకూలి పోయింది. చికెన్‌ తింటే వైరస్‌వ్యాప్తి చెందుతున్న ప్రచారంతో అత్యధిక శాతం మంది కొనుగోలు చేయడం మానేశారు. అది పౌలీ్ట్ర రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. దాదాపు రెండు నెలలపాటు చికెన్‌ జోలికి జనం వెళ్లక పోవడంతో ఒక్కసారిగా కిలో రూ. 50 నుంచి రూ. 60కి  దిగజారింది. దుకాణదారులు చికెన్‌ కొనుగోలు చేసిన వారికి ఉల్లిపాయలు, ఇతరత్రా ఆఫర్లు ప్రకటించి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అలాంటి పరిస్థితిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదన్న నిర్ధారణకు జనం వచ్చారు. ఆప్రభావం జిల్లాలో ఆదివారం చికెన్‌ దుకాణాలు వద్ద కనిపించింది. ఒంగోలుతోపాటు పలు ఇతర పట్టణాల్లో చికెన్‌ కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉదయమే బారులు తీరి కనిపించారు.


లాక్‌ డౌన్‌ తో కొద్ది సమయం మాత్రమే అమ్మకాలకు అవకాశం ఉండడంతో పలుచోట్ల తీవ్ర రద్దీ  ఏర్ప డింది. ఒంగోలు మార్కెట్లో ఆదివారం కిలో చికెన్‌ రూ. 120 పలకగా, నాటు కోడి మాంసం కిలో రూ. 500 పలికింది. ఇతర ప్రాంతాల్లో కాస్త అటు, ఇటుగా ఆస్థాయి ధరలు ఉన్నట్లు సమా చారం. కాగా తాజా పరిస్థితుల్లో చికెన్‌ దుకాణదారులు, కోళ్ల పెంపకందారులు ఊరట చెందుతున్నారు.


పుంజుకున్న చికెన్‌ ధరలు

అద్దంకి: చికెన్‌ ధ రలు పుంజుకుం టున్నాయి. పక్షం రోజుల క్రితం కిలో రూ.30 ఉన్న చికెన్‌ ధర ప్రస్తుతం రూ.100కి చేరింది. గత రెండు వారాలలో రోజు రోజుకు చికెన్‌ ధరలు క్రమేపీ పెరిగి కిలో 100 రూపాయలకు చేరింది. పట్ట ణంలోని భవానిసెంటర్‌లో చికెన్‌ దుకాణాల వద్ద కొనుగోలు దారులు సామాజిక దూరం పాటించగా, పోతురాజు గండి వద్ద ఉన్న చికెన్‌ దుకాణాల ముందు కొనుగోలు దారులు గుంపులు గుంపులుగా ఉన్నారు.

Updated Date - 2020-03-30T10:16:23+05:30 IST