చెన్నకేశవ స్వామికి ఊంజల్ సేవ
ABN , First Publish Date - 2020-12-28T05:34:14+05:30 IST
స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారికి ఆదివారం రాత్రి ఊంజల్ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మార్కాపురం(వన్‌టౌన్), డిసెంబరు 27: స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారికి ఆదివారం రాత్రి ఊంజల్ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకస్వాములు నంద్యాల తిరుమాలాచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను వివిధ సువర్ణ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉయ్యాల సేవ నిర్వహించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.