రుణాలు చెల్లించలేదని ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-12-02T03:58:13+05:30 IST
ఒంగోలులో వాహనాల రుణాల మంజూరు చేసే ఫైనాన్స్ కంపెనీ లావాదేవీల్లో రూ.57 లక్షలు చెల్లించకుండా మోసం చేసినట్లు తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది.
ఒంగోలు(క్రైం), డిసెంబరు 1 : వాహనాల రుణాల మంజూరు చేసే ఫైనాన్స్ కంపెనీ లావాదేవీల్లో రూ.57 లక్షలు చెల్లించకుండా మోసం చేసినట్లు తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు... ఒంగోలులోని రావి ఆంజనేయులు వీధిలో ఇంటిగ్రేట్ ఫైనాన్షియల్ సర్వీస్ నిర్వహిస్తున్న టీవీ సుబ్బారెడ్డి, చెన్నైకు చెందిన దుర్గా ఫైనాన్షియల్ ఇన్వి్‌స్టమెంట్ లిమిటెడ్‌లో ఫ్రాంచైజీ అగ్రిమెంట్ తీసుకుని వాహనాలకు రుణాలు ఇస్తున్నారు. 18 వాహనాలకు రుణాలు ఇప్పించారు. ఒక దానికి తీసుకున్న రుణం చెల్లించి, మిగిలిన 17 వాహనాల రుణం వాహనదారుల వద్ద వసూలు చేసి కంపెనీకి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో దుర్గా ఫైనాన్షియల్ కంపెనీ మేనేజర్ జె.బాలాజీజనార్దన్ తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుబ్బారెడ్డి రూ.57,02,646 కంపెనీకి చెల్లించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.