చార్జింగ్‌స్టేషన్‌ల ఏర్పాటు కోసం దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-12-12T05:21:29+05:30 IST
ల్లాలో రహదారుల వెంట ఎల క్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు నెడ్‌క్యాపును స ంప్రదించాలని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.హరినాథబాబు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 11 : జిల్లాలో రహదారుల వెంట ఎల క్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు నెడ్‌క్యాపును స ంప్రదించాలని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.హరినాథబాబు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జాతీయరహదారుల వెంట ప్రతి 25 కిలోమీటర్లకు ఒ క్కొక్క స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిపా ర్ట్‌మంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్(డీహెచ్‌ఐ) నిర్ణయించిందన్నారు. బెంగళూ రు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే, చెన్నై- భువనేశ్వర్ హైవే, చెన్నై బళ్ళారి హైవే, చెన్నై నాగపూర్ హైవేలో ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్క చార్జింగ్‌స్టేషన్ ఏర్పాటుకు కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం అవసరమని తెలిపారు. భూ యజమాని స్థలం ఇస్తే నెడ్‌క్యాప్ ఏపీ సంస్థ, ఈఈఎస్‌ఎల్ ద్వారా లే దా ఎన్‌టీపీసీ ద్వారా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అందులో వచ్చే ఆదాయాన్ని భూయజమానికి, నెడ్‌క్యాప్ సంస్థ, ఈఈఎస్‌ఐ షేరింగ్ పద్ధతిలో పంచడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు, పెట్రో లు బంకు ఓనర్లు, ఇతరులు నెట్‌క్యాప్ సంస్థలో సంప్రదించాలని కోరారు.