సెల్‌ఫోన్‌ రిపేరు చేయడం లేదని.. కోపంతో..

ABN , First Publish Date - 2020-08-16T17:44:26+05:30 IST

సెల్‌ఫోన్‌ రిపేరు ఎందుకు చేయలేందటూ కత్తితో దాడి చేసిన సంఘటన చీరాలలో..

సెల్‌ఫోన్‌ రిపేరు చేయడం లేదని.. కోపంతో..

చీరాలటౌన్(ప్రకాశం): సెల్‌ఫోన్‌ రిపేరు ఎందుకు చేయలేందటూ కత్తితో దాడి చేసిన సంఘటన చీరాలలో శనివారం జరిగింది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపల్‌ పరిధిలోని విఠల్‌నగర్‌ కు చెందిన బుజ్జి ఢిల్లీరాజా డిప్లొమా పూర్తి చేసి సెల్‌ఫోన్‌ రిపేర్లు చేసు కుంటూ జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దుర్గ తన సెల్‌ఫోను రిపేరు చేయాలంటూ ఢిల్లీరాజాకు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా  రిపేరు చేయకపోవడంతో శుక్రవారం రాత్రి  రెడ్డిగారి మేడ సమీపంలో ఓ  దుకా ణం దగ్గర ఉన్న ఢిల్లీరాజాను దుర్గ ప్రశ్నించాడు. మద్యం మత్తులో గొడవ కు దిగి చాకుతో కడుపులో పొడవంతో డిల్లీ రాజా తీవ్రంగాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలిం చారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-08-16T17:44:26+05:30 IST