అక్రమంగా గ్రానైట్‌ తరలింపుపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-02T11:06:36+05:30 IST

ఒకే బిల్లుపై రెండు సార్లు గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలపై మార్టూరు పోలీసు స్టేషనులో ఆదివారం కేసు నమోదు చేసి నట్లు ఏఎస్సై

అక్రమంగా గ్రానైట్‌ తరలింపుపై కేసు నమోదు

మార్టూరు మార్చి 1 : ఒకే బిల్లుపై  రెండు సార్లు గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలపై మార్టూరు పోలీసు స్టేషనులో ఆదివారం కేసు నమోదు చేసి నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాలుగురోజుల క్రితం మం డలంలోని బొబ్బేపల్లి టోల్‌ప్లాజా వద్ద గ్రానైట్‌ శ్లాబులతో వెళుతున్న ఒక లారీని, రాజుపాలెం  కూడలి సమీపంలో యలవర్తి కోల్డ్‌స్టోరేజీ ఎదురుగా గ్రానైట్‌ ముడిరాయిని తీసుకు వెళుతున్న ఒక లారీని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ రెండు లారీల్లో ఒక్కోలారీ ఒక బిల్లుతో రెండుసార్లు గ్రానైట్‌ను రవాణా చేస్తున్నట్లు  అధికారులు గుర్తించారు. దీంతో ఒంగోలు మైన్స్‌ అండ్‌ జియాలజీ ఏడీ డి. జగ న్నాథరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కే.మల్లి కార్జున కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-03-02T11:06:36+05:30 IST