కారు ఉల్టాపల్టా

ABN , First Publish Date - 2020-12-31T04:09:55+05:30 IST

కారు పల్టీలు కొట్టుకుంటూ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలోని స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

కారు ఉల్టాపల్టా
కాలువలోకి దూసుకుపోయిన కారుకాలువలోకి దూసుకుపోయిన వైనం
తప్పిన పెనుప్రమాదం.. పర్చూరు, డిసెంబరు 30 : కారు పల్టీలు కొట్టుకుంటూ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలోని స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... చీరాల నుంచి ఆరుగురు వ్యక్తులు కారులో వినుకొండ వెళుతున్నారు. సబ్‌స్టేషన్‌ సమీపంలోకి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. రోడ్డు దిగువ నుంచి కారు పల్టీలు కొట్టుకుంటూ కాలువలోకి పడిపోయింది. సమీపంలో ఉన్న వారు పరుగెత్తుకుంటూ వెళ్లి కారు అద్దాలను తొలగించి లోపలున్న వారిని బయటకు తీశారు. ఇదే రహదారిలో వారం క్రితం నుంచి వరుస ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Updated Date - 2020-12-31T04:09:55+05:30 IST