సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2020-11-26T06:02:36+05:30 IST
సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవ చ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వీ.ఎ్‌స.ఎ్‌స.దుర్గాప్రసాద్ అన్నారు.

గిద్దలూరు టౌన్, నవంబరు 25 : సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవ చ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వీ.ఎ్‌స.ఎ్‌స.దుర్గాప్రసాద్ అన్నారు. బుధవా రం గిద్దలూరు సబ్‌డివిజన్ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, బేస్తవారపేట మండలాలలో బృందం పరిశీలించింది. మొక్కజొన్న, కంది, మిరప పంటలను ఆయనతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి.రమే్‌షబాబు, సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్ పరిశీలించారు. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు ఉన్నట్లు గుర్తించారు. ఎకరాకు 6 నుంచి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాదికారి ఎస్.రామ్మోహన్‌రెడ్డి, స్వచ్ఛం ద సేవాసంస్థ డైరెక్టర్లు వైజాసత్యభూపాల్‌రెడ్డి, సూరె సుబ్బారావు పాల్గొన్నారు.
రాచర్ల : ఆముదం సాగు చేసే రైతులు అధికారుల సూచనలను పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి విజ్ఞానక్షేత్రం శాస్త్రవేత్త దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం రాచర్లలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆముదం సాగు చేసే రైతులతో సమావేశమై మాట్లాడారు. ఆముదం సాగు చేసే అంశాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో కీటక నివారణ శాస్త్రవేత్త డాక్టర్ రమే్‌షబాబు, ఏడీఏ బాలాజీనాయక్ ఏవో షేక్ మహబూబ్‌భాషా పాల్గొన్నారు.