భైరవకోనలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2020-12-07T05:17:01+05:30 IST

ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో ఆది వారం పర్యాటకులు సందడి చేశారు.

భైరవకోనలో భక్తుల సందడి
త్రిముఖదుర్గాంభాదేవికి పూజలు చేస్తున్న భక్తులు


సీఎస్‌పురం, డిసెంబరు 6 : ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో ఆది వారం పర్యాటకులు సందడి చేశారు. సెలవు దినం, కార్తీకమాసం కావడంతో కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఉద్యోగస్థులు, యువకులు ఉదయం నుంచే ప్రత్యేక వాహనాలలో భైరవకోన చేరుకుని జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సందడి చేశారు. ఆలయ పూజారులు త్రిముఖదుర్గాంభాదేవికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు.  కార్తీకమాసం కావడంతో మహిళలు దీపారాధనలు చేశారు. భక్తులు కాలభైర వున్ని, శివలింగాలను, త్రిముఖదుర్గాంభాదేవిని దర్శించి పూజలు చేశారు. 


Read more