మద్యం వ్యాపారి 24 కోట్లకు ఐపీ !

ABN , First Publish Date - 2020-12-30T05:46:10+05:30 IST

చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో పలుచోట్ల మద్యం వ్యాపా రం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి రూ.24కోట్లకు ఐపీ పెట్టాడు. ఆ మేరకు కోర్టును ఆశ్రయిం చినట్లు తెలిసింది.

మద్యం వ్యాపారి 24 కోట్లకు ఐపీ !


రుణదాతలు సుమారు 140మంది.. ఆందోళనలో బాధితులు
చీరాల, డిసెంబరు 29 : చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో పలుచోట్ల మద్యం వ్యాపా రం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి రూ.24కోట్లకు ఐపీ పెట్టాడు. ఆ మేరకు కోర్టును ఆశ్రయిం చినట్లు తెలిసింది. రుణదాతలు 140మంది వరకు ఉన్నట్లు సమాచారం. రుణాలు తీసుకుంటూ నమ్మకంగా వడ్డీతో సహా నిర్ణీత కాలవ్యవధిలో తిరిగి చెల్లిస్తూ అందరి వద్ద నమ్మకం సంపాదించాడు. వాస్తవానికి మద్యం వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారిగా అతనికి పేరుంది. మద్యం వ్యాపారానికి సంబంధించి నష్టాలు వచ్చే అవకాశం లేదని విషయం తెలిసిన వారు అంటున్నారు. ఆ వ్యాపారికి అప్పు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది పెద్దమొత్తాలు ఇచ్చారు. కొందరు అధికారులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీ(ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌) కోర్టులో దాఖలు చేశారని, అందులో కొద్ది   వ్యవసాయ భూమి మాత్రమే ఆస్తిగా చూపినట్లు సమాచారం. కొందరు బ్యాంకులకన్నా ఆ మద్యం వ్యాపారి దగ్గరే తమకున్న మొత్తాన్ని దాచుకున్నారంటున్నారు. ఐపీ ద్వారా తమకు ఏ మేరకు సొమ్ము తిరిగి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T05:46:10+05:30 IST