వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్లా రాజీనామా

ABN , First Publish Date - 2020-03-15T11:05:18+05:30 IST

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పదవికి బొట్లా రామారావు శనివారం రాజీనామా చేశారు. బీసీ మహిళకు రిజర్వు అయిన

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్లా రాజీనామా

టంగుటూరు, మార్చి 14 :  వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పదవికి బొట్లా రామారావు శనివారం రాజీనామా చేశారు.  బీసీ మహిళకు రిజర్వు అయిన ఎంపీపీ పదవి దక్కేందుకు వీలుగా ఎంపీటీసీ స్థానాల్లో తన కుటుంబానికి ఎక్కడా అవకాశం కల్పించనందుకు తీవ్ర మనస్తాపం చెందాడు . దీంతో తన రాజీనామాను జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి  కొరియర్‌ ద్వారా పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ అవిర్భావం నుంచి మండలంలో పార్టీకి అన్నీతానై నిలిచానని, అయినా పార్టీ తనను అవమాన పరచిందన్నారు.


మండలంలో ఎంపీపీ పదవి బీసీ మహిళలకు రిజర్వు కావడంతో తనకుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నానని, సాధారణ సభ్యుడిగా  కొనసాగుతానని తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-15T11:05:18+05:30 IST