రక్త దానంతో ప్రాణదానం

ABN , First Publish Date - 2020-12-30T06:16:27+05:30 IST

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయాలని వైద్యాధికారి భరద్వాజ తెలిపారు.

రక్త దానంతో ప్రాణదానం

పెద్ద దోర్నాల, డిసెంబరు 29 : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయాలని వైద్యాధికారి భరద్వాజ తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల బ్లడ్‌ బ్యాంకు ఆధ్యర్వంలో మంగళవారం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి భరద్వాజ, పట్టణానికి చెందిన యువకుడు ఎలకరి నారాయణలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి షరీఫ్‌, యూడీసీ రాజశేఖర్‌, ఆరోగ్యమిత్రలు దర్శనం రాంబాబు, చంద్రశేఖర్‌, సిబ్బంది సుధీర్‌, తిరుమలరావు, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:16:27+05:30 IST