బీజేపీలో కుటుంబపాలనకు తావులేదు!
ABN , First Publish Date - 2020-11-27T05:13:08+05:30 IST
బీజేపీలో కుటుంబపాలనకు తావులేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయిక్రిష్ణ అన్నారు.

గిద్దలూరు, నవంబరు 26: బీజేపీలో కుటుంబపాలనకు తావులేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయిక్రిష్ణ అన్నారు. గురువారం స్థాని క విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కుటుంబ పాలనకు ప్రా ధాన్యత ఇస్తూ, నాయకులను, కార్యకర్తలను గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును తగిలించుకుని దేశప్రజల ను మోసం చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాల న్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులు, మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకుడు షేక్ బాజీ, కె.వెంకటరమణయ్య, క న్వీనర్ ఏనుగుల పద్మావతి, ఆంజనేయులు, రెడ్డి మల్లారెడ్డి, పల్లెం శ్రీనివాసులు తదితరులు కూడా మాట్లాడారు.
2
రాజ్యాంగంతో దళితులకు స్వేచ్ఛ
జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ కమలమ్మ
గిద్దలూరు టౌన్, నవంబరు 26: అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం దళితులకు కొండంత అండ కలిగించిందని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం.కమలమ్మ అన్నారు. బుధవారం పట్టణంలోని హరిప్రి య ఫంక్షన్ హాలులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 71వ భా రత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమలమ్మ మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు అ న్నిరంగాల్లో రాణించేందుకు రాజ్యాంగం దారులు చూపిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం ద్వారా దళితులకు రక్షణ కలిగిందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జె.ప్రభాకర్, నియోజకవర్గ కన్వీనర్ పెరికె మహేష్‌బాబు, కొమరోలు మండల కన్వీనర్ గుర్రం ప్రభాకర్‌బాబు, మార్కాపురం నియోజకవర్గ మహిళ కన్వీనర్ నందిగామ సుష్మిత తదితరులు పాల్గొన్నారు.