బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-11-25T05:37:36+05:30 IST

రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆపార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి


పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి

మార్కాపురం, నవంబరు 24 : రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆపార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేం దుకు సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీ మార్కాపురం నియోజకవర్గ శిక్షణ తరగతులను ఎస్వీకేపీ కళాశాలలో మంగళవారం ఆంజనేయరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి, స్వదేశీయత కోసం బీజేపీ పాటుపడుతున్న దన్నారు. ప్రధాని మోదీ భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లారన్నారు. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బీజేపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన శిక్షణలో రాష్ట్ర నాయకురాలు శాసనాల సరోజి ని, నాయకులు శ్రీనివాసులు,  కృష్ణ, చిన్నయ్య, రామచంద్ర, రుషి, పరమాత్మ  పాల్గొన్నారు. 


Read more