-
-
Home » Andhra Pradesh » Prakasam » bjp Dharn
-
రోడ్లకు మరమ్మతులు కోరుతూ బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2020-12-06T06:48:40+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్

ఒంగోలు కలెక్టరేట్, నవంబర్ 5:నివర్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లాలో ఆందోళనలు చేపట్టింది. ఒంగోలులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అనేక రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యోగయ్యయాదవ్, కనమాల రాఘవులు, పి.మోజెష్, కొమ్ము శ్రీనివాసులు, ధనిశెట్టి రాము, ఎం.హరి, దామోదర్, సత్యవతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురంలోనూ అక్కడి నేతలు నిరసన తెలిపారు.