షార్టు సర్క్యూట్‌తో బయో డీజిల్‌ ప్లాంట్‌ దగ్ధం

ABN , First Publish Date - 2020-12-10T05:31:47+05:30 IST

విద్యుదాఘాతంతో బయోడీజిల్‌ ప్లాంటు దగ్ధమైన ఘటన మేడపిలో బుధవారం జరిగింది.

షార్టు సర్క్యూట్‌తో బయో డీజిల్‌ ప్లాంట్‌ దగ్ధం
దగ్ధమౌతున్న ప్లాంటు

త్రిపురాంతకం, డిసెంబరు 9 : విద్యుదాఘాతంతో బయోడీజిల్‌ ప్లాంటు దగ్ధమైన ఘటన మేడపిలో బుధవారం జరిగింది. ఐటీవరానికి చెందిన మాదినీడి అంజయ్య మేడపి సమీపంలో బయోడీజిల్‌ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే పనులు నిర్వహించుకున్న అంజయ్య పక్కగదిలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. వెంటనే గమనించి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా ప్రమాదంలో రూ. 2 లక్షల నగదు, 7 వేల లీటర్ల డీజిల్‌,  కారు, రెండు ట్రాక్టర్‌ టైర్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణయ్య, వై.పాలెం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Updated Date - 2020-12-10T05:31:47+05:30 IST