అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2020-07-10T10:57:46+05:30 IST
ముంబయిలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రాజ్‌గృహపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని మాలమహానాడు ..

ఒంగోలు(కలెక్టరేట్), జూలై 9 : ముంబయిలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రాజ్‌గృహపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు డిమాండ్ చేశారు. రాజ్‌గృహపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తంచేవారు. కార్యక్రమంలో నాగార్జున, వెంకటరా వు, అనిల్, కొండలు, అంజయ్య, రోశయ్య, వినోద్, విష్ణు, రమేష్, అంజయ్య పాల్గొన్నారు. అలాగే జనం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. చావాబత్తిన రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చప్పిడి రవిబాబు, సంపత్‌కుమార్, రాంబాబు, బి.వెంకట్, పి.మధురశ్రీ, బి.దశరథరామ్ పాల్గొన్నారు.