-
-
Home » Andhra Pradesh » Prakasam » bikest dead
-
కారు ఢీకొని మోటారుసైక్లిస్టు మృతి
ABN , First Publish Date - 2020-12-28T03:55:38+05:30 IST
మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలు నగరం విరాట్‌నగర్‌కు చెందిన అద్దెపల్లి రామమోహనరావు (50)మృతి చెందాడు.

మరొకరికి గాయాలు
మద్దిపాడు, డిసెంబరు 27 : మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలు నగరం విరాట్‌నగర్‌కు చెందిన అద్దెపల్లి రామమోహనరావు (50)మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు... విరాట్‌నగర్‌కు చెందిన అద్దెపల్లి రామమోహనరావు, తన స్నేహితులైన వేమూరి శ్రీమన్నారాయణ సింగరకొండ వెళ్లి మోటారుసైకిల్‌పై ఒంగోలు వెళుతున్నారు. గుండ్లాపల్లి ఫ్లైఓవర్ సమీపానికి వచ్చే సరికి వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన పంక్చర్ అయ్యి ఆగివున్న లారీని ఢీకొట్టింది. అనంతరం కారు అదుపు తప్పి ముందు వెళుతున్న మోటారుసైకిల్‌ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న రామ్మోహనరావు కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే వేమూరి శ్రీమన్నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఎస్‌ఐ ఫిరోజ్‌ఫాతిమా ఘటనాస్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.