రెండు బైకులు ఢీ

ABN , First Publish Date - 2020-11-22T05:06:17+05:30 IST

రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు బైకులు ఢీ

ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం 


కనిగిరి, నవంబరు 21 : రెండు బైకులు ఢీకొని  ఇద్దరు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణ సమీపంలోని టకారిపాలెం వద్ద  జరిగిన ప్రమాద వివరాలివి.  టకారిపాలెం వద్ద కమాల్‌ బాషా, షేక్‌ అర్హద్‌ బైక్‌లపై వెళ్తున్నారు. కనిగిరి నుంచి పొదిలివైపు వెళ్తున్న లారీని క్రాస్‌ చేయబోతుండగా ఎదరుగావస్తున్న మోటారు బైక్‌ను కమాల్‌బాషా బైక్‌ ఢీ కొట్టింది.  దీంతో వారు రోడ్డుపై పడిపోయారు. హర్షద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  ఇద్దరినీ 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరించారు.  మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు.

Read more