భైరవకోనలో పర్యాటకుల సందడి
ABN , First Publish Date - 2020-11-16T05:02:17+05:30 IST
భైరవకోనలో పర్యాటకుల సందడి

సీఎస్‌పురం, నవంబరు 15 : ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవ కోనలో ఆదివారం పర్యాటకులు, భక్తులు సందడి చేశారు. సెలవు ది నం కావడంతో కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఉద్యోగులు, యువకులు ఉదయం నుంచే ప్రత్యేక వాహనాలలో భైరవకోన చేరుకుని జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సందడి చేశారు. యువ కులు జలపాతం వద్ద ఉల్లాసంగా గడిపారు. భక్తులు కాలభైరవున్ని, శివలింగాలను, త్రిముఖదుర్గాంభాదేవిని దర్శించి పూజలు చేశారు.