ప్రపంచ దేశాలకు ధీటుగా భారత నావికాదళం

ABN , First Publish Date - 2020-12-07T05:04:15+05:30 IST

ప్రపంచ దేశాలకు ధీటుగా భారత నావికాదళం బలంగా ఉందని, ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లో అయినా పోరాడగలదని మాజీ సైనికుల జాతీయ అధ్యక్షు డు లింగాల జగన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలకు ధీటుగా భారత నావికాదళం
మాట్లాడుతున్న జగన్‌రెడ్డి

మాజీ సైనికుల జాతీయ అధ్యక్షుడు జగన్‌రెడ్డి 

ఘనంగా నావీడే


ఒంగోలు(రూరల్‌), డిసెంబరు 6 : ప్రపంచ దేశాలకు ధీటుగా భారత నావికాదళం బలంగా ఉందని, ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లో అయినా పోరాడగలదని మాజీ సైనికుల జాతీయ అధ్యక్షు డు లింగాల జగన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నావీడేను ఒంగోలు మిలటరీ క్యాంటీన్‌ ఆవరణ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జగన్‌రెడ్డి మాట్లాడు తూ భారత నావికాదళం 1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో కరాచిని ఆక్రమించి సత్తా చాటిందన్నారు. దేశానికి మూడు దిక్కుల్లో ఉన్న సముద్ర తీరంలో శత్రువులు ప్రవేశించకుండా నావీకాదళం నిరంతరం అప్రమత్తంగా ఉందన్నా రు. డ్వామా పీడీ శీనారెడ్డి మాట్లాడుతూ దేశ సైనికుల త్యాగాలను స్మరించుకోవాల్సి అవసరం ఉందన్నారు. వారి సేవలును ఎలకట్టలేనివని చె ప్పారు. మాజీ సైనికుల రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నె ప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్యంలో చే రటం దేశానికి సేవచేయటం లాంటిదని తెలిపా రు. ముందుగా వీరజవానుల విజయస్థూపం వ ద్ద శ్రద్ధాంజలి ఘటించారు. విద్యార్థులు నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి.  జిల్లా అధ్యక్షుడు చుండూరి శ్రీరామూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికు లు పాశం వెంకటరెడ్డి, టి.వెంటేశ్వర్లు, దశరథ రా మయ్య, మండవ వెంకటేశ్వర్లు, అంజయ్య, క్యాం టీన్‌ మేనేజర్‌ గుమ్మడి వెంకట్రావు, గంజాం సా యిబాబా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-07T05:04:15+05:30 IST