మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2020-04-24T10:57:34+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు మెరుగైన

మెరుగైన సేవలందించాలి

చీరాల, ఏప్రిల్‌ 23 : కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు.  మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం  కమిషనర్‌ చాంబర్‌లో అధికారులతో ఎమ్మెల్యే బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల కు అందుతున్న సేవలు, కరోనా కేసులు తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నాగమల్లేఽశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి డాక్టర్‌ బేబీరాణి, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో మాధవీలత, చీరాల, వేటపాలెం మండలాల తహసీల్దార్లు, క్వారంటైన్‌ ఇన్‌చార్జి నరసింహులు పాల్గొన్నారు. 


రామకృష్ణాపురంలో కోరోనా అనుమానిత కేసుపై సమీక్ష

అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన ఓ వ్యక్తిని కరోనా అనుమానితుడిగా ఒంగో లు తరలించారు. అతని పరీక్షలు పూర్తిగా వెలువడకముందే ఆ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని ప్రచారం జరిగింది. రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయంలో ఆర్డీవో స్పెషలాఫీసర్‌ డాక్టర్‌ బేబీరాణి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఏపీఈడీవో సాంబశివరావులతో సమీక్షించారు. రామకృష్ణాపురం, పేరాలలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 

Updated Date - 2020-04-24T10:57:34+05:30 IST