బెస్ట్‌.. అవుట్‌!

ABN , First Publish Date - 2020-10-21T17:52:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బెస్టు అవైలబుల్‌ స్కూల్స్‌కు మంగళం పాడనుంది. ఈ ఏడాది నుంచే నిలిపివేయనుంది. ఈ పథకాన్ని గత ప్రభుత్వం..

బెస్ట్‌.. అవుట్‌!

అవైలబుల్‌ స్కూళ్లకు సర్కారు మంగళం

పథకం కింద చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ

కేవలం 9,10 తరగతులకు మాత్రమే కొనసాగింపు


ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం బెస్టు అవైలబుల్‌ స్కూల్స్‌కు  మంగళం పాడనుంది. ఈ ఏడాది నుంచే  నిలిపివేయనుంది. ఈ పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. దళిత వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రయివేట్‌ స్కూళ్లలో ప్రవేశం కల్పించి 2 నుంచి 10వ తరగతి వరకూ నాణ్యమైన విద్యను అందించాలన్నది దీని ముఖ్య ఉదే ్దశం. ఈ పథకం కింద జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో రెండువేల మంది వరకూ చదువుకుంటున్నారు. వీరికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే ప్రయి వేట్‌ పాఠశాలలకు చెల్లిస్తోంది. అయితే ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నం చేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇప్పటి వర కూ పాఠశాలలు పున:ప్రారంభం కాలేదు.


మరికొద్ది రోజుల్లో తెరుచుకునే అవకాశం ఉండటంతో బెస్టు అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ప్రయివేట్‌ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందా యి. 2 నుంచి 4 తరగతుల వరకూ ఈ పథకం కింద చదు వుతున్న వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, 5 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించనున్నారు.  వీరందరికీ ఈ ఏడాది నుంచి ప్రయివేట్‌ విద్య దూరం కానుంది. ఈ పథకం కింద ప్రయివేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 9,10 తరగతుల విద్యార్థులను మాత్రమే కొన సాగించనున్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ కింద ఈ ఏడాది నుంచి ఏ ఒక్కరికి ప్రయివేట్‌ పాఠశాలల్లో ప్రవేశం కల్పించకూడదనే ఆదేశాలు జారీ కావ టంతో పథకం పూర్తిగా అటెకెక్కినట్టే అయ్యింది.


నేడు తల్లిదండ్రులతో  సమావేశం

బెస్టు అవైల్‌బుల్‌ స్కూల్స్‌ పథకం కింద చదువుతున్న విద్యార్ధులు తల్లిదండ్రులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసమావేశం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. ప్రయివేట్‌ పాఠశాలల్లో ఉంటే ఇక ప్రభుత్వం ఖర్చు భరిం చలేదని, సమీప ప్రభుత్వ పాఠశాలలల్లో చేర్పించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు చెప్పపనున్నారు. 


Updated Date - 2020-10-21T17:52:16+05:30 IST