అయ్యన్నశెట్టి సత్రం లీజును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-11-16T05:08:10+05:30 IST
ఒంగోలు రైల్వేస్టేషన్ రోడ్డులో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పొత్తూరి అయ్యన్నశెట్టి సత్రాన్ని లీజు పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని దేవదాయశాఖ తక్షణం విరమించు కోవాలని బీజేపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకుల డిమాండ్
ఒంగోలు(కల్చరల్), నవంబరు 15 : ఒంగోలు రైల్వేస్టేషన్ రోడ్డులో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పొత్తూరి అయ్యన్నశెట్టి సత్రాన్ని లీజు పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని దేవదాయశాఖ తక్షణం విరమించు కోవాలని బీజేపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అ య్యన్నశెట్టి సత్రం స్థలాన్ని ఈనెల 19న లీజు వే స్తూ టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఆదివారం ప లువురు పార్టీ నాయకులతో కలిసి సత్రాన్ని పరిశీ లించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభా వాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది శ్రీనివాసు లు ఆరోపించారు. దాతలు తిరుపతి, శ్రీశైలం వెళ్లే భక్తుల విశ్రాంతి కోసం నిర్మించిన సత్రాన్ని అభి వృద్ధి చేయాల్సింది పోయి, అధికార పార్టీ నా యకులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్నారు. రూ.కోట్ల విలువ కలిగిన దేవాలయ భూముల ను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నం జరుగు తుందని, దీన్ని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామ ని, ఇందుకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కొమ్మి నరసింగరావు, ఓబీసీ నా యకులు రావులపల్లి నాగేంద్రయాదవ్, వై.యోగ య్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి నాగే శ్వరరావు, వైవీ.అశోక్‌యాదవ్, రామిశెట్టి హరిబా బు, గుర్రం సత్యనారాయణ, నాగ ఆంజనేయులు, ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.