-
-
Home » Andhra Pradesh » Prakasam » awirnes to student
-
మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన
ABN , First Publish Date - 2020-12-19T05:59:29+05:30 IST
మత్తుపదార్థాలకు దూరంగా, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా యువత ఉండాల ఎస్సై రవీంద్రరెడ్డి అన్నారు.

గిద్దలూరు టౌన్, డిసెంబరు 18 : మత్తుపదార్థాలకు దూరంగా, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా యువత ఉండాల ఎస్సై రవీంద్రరెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పోలీసుస్టేషన్ నుంచి కుమ్మరాంకట్ట, రైల్వేస్టేషన్ నుంచి రాచర్లగేటు వరకు కొనసాగింది. రాచర్లగేటు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈసందర్భంగా ఎస్‌ఐ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే సమయంలో పలువురు యువకులు మాదకద్రవ్యాలకు అలవాటుపడి చెడు మార్గం వైపు నడుస్తున్నారని ఆయన
భర్త దాడిలో గిరిజన మహిళ మృతి
పెద్ద దోర్నాల, డిసెంబరు 18 : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యపై దాడి చేయడంతో ఆమె మృతిచెందిన ఘటన మండలంలోని తుమ్మలబైలు గిరిజన గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తమ్మలబైలుకు చెందిన భూమని గోవిందమ్మ (20), భర్త వెంకటేశంలు దంపతులు. వీరు ఈ నెల 15న గొడవ పడ్డారు. దీంతో గోవిందమ్మ అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. పెద్దలు ఇద్దరిని పిలిచి సమదాయించారు. 16న మళ్లీ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశం భార్యపై కాలితో తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలి పడిపోయింది. అనంతరం కడుపులో నొప్పి ఎక్కువగా రావడంతో 17న ఆమెను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సలు నిర్వహించిన వైద్యాధికారులు ఒంగోలు రిమ్స్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆమెను రిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున ఆమె మృతి చెందింది. బంధువుల పిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉయ్యాల హరిబాబు తెలిపారు.