హక్కుల పట్ల అవగాహన అవసరం: జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్

ABN , First Publish Date - 2020-12-11T06:06:44+05:30 IST

స్వేచ్ఛ, న్యాయం, శాంతి నెలకొనాలంటే కనీస హక్కులను గుర్తించి రక్షించాలనే ఆశయంతో మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు.

హక్కుల పట్ల అవగాహన అవసరం: జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 10 : స్వేచ్ఛ, న్యాయం, శాంతి నెలకొనాలంటే కనీస హక్కులను గుర్తించి రక్షించాలనే ఆశయంతో మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు. స్థానిక కోర్టు భవనాల ఆవరణలో గురువారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి రాజేష్‌ మాట్లాడుతూ 1948 డిసెంబరు 10వ తేదిని మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు, మనుషుల మధ్య జాతి, కుల, లింగ, భాష, మత, ప్రాంత, రంగు, ఆస్తి స్థాయి, అభిప్రాయ బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారని, జీవించే హక్కు, హింస, బానిసత్వానికి గురికాకుండా ఉండే హక్కు సమాన హక్కు అని తెలిపారు. న్యాయం పొందే హక్కులు వంటివి 30 ప్రతి ఒక్కరికి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.సరిత, న్యాయవాదులు ఎం.రంగారెడ్డి, రవిప్రకాశ్‌బాబు, చలపతిరావు, సిద్దయ్య, పారాలీగల్‌ వాలంటీర్‌ అద్దంకి మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:06:44+05:30 IST