నీటికి భరోసా

ABN , First Publish Date - 2020-08-20T08:34:10+05:30 IST

సాగర్‌ ఆయకట్టు రైతులకు వర్షాలు కలిసొచ్చాయి. ఈ ఏడాది జలాశయం ఆధారిత ప్రాంతాల్లో తాగునీటికి, ఆయకట్టు భూముల్లో పంటల

నీటికి భరోసా

 సాగర్‌ ఆయకట్టు రైతులకు వర్షాలు కలిసొచ్చాయి. ఈ ఏడాది జలాశయం ఆధారిత ప్రాంతాల్లో తాగునీటికి, ఆయకట్టు భూముల్లో పంటల సాగుకు పూర్తి భరోసా కనిపిస్తోంది. అంతేకాక మూడు, నాలుగు రోజుల్లోనే సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడికాలువకు నీటి విడుదల జరగనుంది. ఇప్పటికే ఈనెల 25 నుంచి కుడికాలువకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం కృష్ణా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ఇంకా రెండు, మూడు రోజులు ముందుగానే విడుదల చేయవచ్చన్న సంకేతాలున్నాయి.


జిల్లాలో 4.34లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, పలు పట్టణాలతో పాటు వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు సాగర్‌ కాలువల ద్వారా అందుతుంది. గతేడాది 3.65లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా ఈ ఏడాది కూడా ఆమేర సాగు అంచనా వేసిన అధికారులు సాగు, తాగునీటికి కలిపి 72టీఎంసీలు నీరు అవసరంగా ఉన్నతాధికారులు నివేదించారు. అలాగే ఈనెల మూడో వారంలో తొలుత తాగునీటికి, కొనసాగింపుగా .        


సాగునీటికి ఇవ్వాలని కోరారు

ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి జలకళతో ఈనెల 25నుం చి సాగర్‌ నీటిని విడుదలకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా శ్రీశైలం, సాగర్‌ డ్యామ్‌ల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలను పరిశీలించి మూడు రోజుల క్రితం ఆ మేరకు నిర్ణయించారు. అయితే గడిచిన 24 గంట ల్లో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.


ఒకవైపు కృష్ణానదిలో ఎగువన ఆల్మట్టి అక్కడి నుంచి నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల నుంచి, మరోవైపు తుంగభద్ర నుంచి భారీ వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 861 అడుగులకు నీటిమట్టం, 192 టీఎంసీల వరకు నీరు చేరింది. అదే సమయంలో ఎగువ నుంచి 3.85ల క్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వస్తోంది.


దీంతో బుధవారం సా యంత్రం ఆరు గంటల ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సాగర్‌ డ్యామ్‌ ఇప్పటికే నిండుకుండను తలపిస్తోంది. డ్యామ్‌ నీటిమట్టం 590 అడుగులు, నీటిసామర్థ్యం 312 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 571 అడు గులకు, నీటినిల్వ 260 టీఎంసీలకు చేరింది. సుమారు 67వేల క్యూ సెక్కుల ఇన్‌ప్లో ఉండగా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో రెండు రోజుల్లో భారీగా సాగర్‌లోకి కూడా వరద నీరు రానుంది.


రెండురోజులు ముందుగానే..

శ్రీశైలం, సాగర్‌ జలశయాల్లో మూడు నాలుగురో జుల క్రితం ఉన్న నీటి పరిమాణం, ఎగువ నుంచి వస్తున్న వరదను పరిగణనలోకి తీసుకున్న ఉన్న తాధికారులు ఈనెల 25నుంచి సాగర్‌ డ్యామ్‌ నుంచి కాలువలకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు జిల్లా అధి కారులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి కృష్ణాకు భారీగా వరద వస్తుండ టం, శ్రీశైలం గేట్లు కూడా ఎత్తడంతో 25వతేదీ కన్నా రెండురోజులు ముందుగానే సాగర్‌ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉంది.


ఆగస్టు ఆఖరులోపే రాష్ట్రంలోని రెండు పెద్ద జలాశయాలు నిండే అవకాశం ఉంది. అలా గే ఈ సీజన్‌లో మరో రెండు, మూడుసార్లు ఇలాగే వరదలు వచ్చే అవకాశం కూడా ఉండటంతో దానిని బట్టి చూస్తే గతేడాది వలే ఈ ఏడాది కూడా సాగర్‌ ఆయకట్టులో సాగుకు, జిల్లా ప్రజల తాగునీటికి ఢోకా ఉండకపోవచ్చు. 


నీటివిడుదలకు సన్నాహాలు

          డ్యామ్‌లు నిండి నీటి విడుదలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి వాడకంపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం గురువారం ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.


ఇప్పటికే పలు ప్రాంతాల్లోని తాగు నీటి వనరుల్లో నీరు తగ్గిపోయి తక్షణం వాటిని నింపాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు పలుచోట్ల సాగర్‌ ఆయకట్టు రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధమై అందుబాటులో ఉన్న నీటి వనరుల కింద వరినారు పోశారు. కాగా గురువారం జరిగే సమీక్షలో జిల్లాలో నీటి వాడకంపై అధికారులు షెడ్యూల్‌ రూపొందించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-20T08:34:10+05:30 IST