హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-06T09:41:06+05:30 IST

పెద్దారవీడు చెంచు గిరిజన కాలనీలో గత నెల 22న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మార్కాపురం

హత్య కేసులో నిందితుడి అరెస్టు

పెద్దారవీడు, జూన్‌ 5: పెద్దారవీడు చెంచు గిరిజన కాలనీలో గత నెల 22న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కుడుముల చిన్నయ్య, మండ్ల రాజయ్య బావాబావమరుదులు. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని రాజయ్యను చిన్నయ్య అడిగారు. ఇద్దరి మధ్య వివా దం మొదలైంది. ఆవేశంతో చిన్నయ్య అంబును రాజయ్యపైకి విసిరాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసులో నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్‌, సీఐ రాఘవేంద్రరావు, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T09:41:06+05:30 IST