అనారోగ్యంతో ఆర్మీ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2020-11-22T05:12:01+05:30 IST

కంభం మండలం చిన్నకంభం గ్రామానికి చెందిన శెట్లం శ్రీపతి (45) అనారోగ్య కారణంగా మద్రాస్‌ జె్క్షకె మిలటరీ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అనారోగ్యంతో ఆర్మీ ఉద్యోగి మృతి


కంభం, నవంబరు 21 : ఆర్మీలో జూనియర్‌ కమిషనర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కంభం మండలం చిన్నకంభం గ్రామానికి చెందిన శెట్లం శ్రీపతి (45) అనారోగ్య కారణంగా మద్రాస్‌ జె్క్షకె మిలటరీ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చిందని కంభం మండల ఆర్మీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శెట్లం వేణుగోపాల్‌ శనివారం తెలిపారు. 24 సంవత్సరాలుగా ఆర్మీలో వివిధ హోదాలలో పని చేసిన శెట్లం శ్రీపతికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నట్లు తెలిపారు. అయితే శ్రీపతి కరోనా సోకడంతో వైద్యశాలలో వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పలువురు భావిస్తున్నారు. శ్రీపతి మృతదేహాన్ని స్వగ్రామానికి ఆదివారం తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ జవాన్‌కు పలువురు నివాళులు అర్పించారు. 

Read more