‘ప్రేతాత్మకు పింఛన్‌’పై కదిలిన అధికారులు

ABN , First Publish Date - 2020-09-16T17:56:20+05:30 IST

మండలంలోని అరివేముల గ్రామంలో చనిపోయిన వ్యక్తి పింఛన్‌ నగదును కాజేయడంపై..

‘ప్రేతాత్మకు పింఛన్‌’పై కదిలిన అధికారులు

వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను విచారించిన వైనం 

వలంటీర్‌పై చర్యలు 


సీఎస్‌పురం(ప్రకాశం): మండలంలోని అరివేముల గ్రామంలో చనిపోయిన వ్యక్తి పింఛన్‌ నగదును కాజేయడంపై మంగళవారం ఆంధ్రజ్యోతిలో ‘ప్రేతాత్మకు పింఛన్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో మంగళవారం డీఆర్‌డీఏ ఏపీడీ జీవీ వరప్రసాద్‌ గ్రా మసచివాలయాన్ని తనిఖీ చేశారు. పింఛన్‌ విడుదలపై విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెదబసవయ్య ఈ ఏడాది జూన్‌ 5న చనిపోగా ఆయన కు టుంబ సభ్యులు అదే నెల 11న మరణ ధ్రువీకరణపత్రం తీసుకున్నారని చెప్పారు. జూలై, ఆగస్టు రెండు నెలల పింఛన్‌ సచివాలయ వెల్ఫేర్‌ బాధ్యతారాహిత్యంతో వలంటీర్‌ డ్రా చేసినట్లు విచారణలో తేలిందన్నా రు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వ లంటీర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ కన్సల్టెంట్‌ యు.కిషోర్‌బాబు, ఎంపీడీవో కట్టా శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రామయ్య పాల్గొన్నారు. 


ఉద్యోగుల తీరుపై ఫిర్యాదు చేసిన గ్రామస్థులు

అరివేముల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి తిరిగి వస్తున్న డీఆర్‌డీఏ ఏపీడీ జీవీ వరప్రసాద్‌, ఎంపీడీవో కట్టా శ్రీనివాసులను జంగంవారిపల్లి గ్రామంలో అరివేముల గ్రామస్థులు అడ్డగించారు. సచివాలయ ఉ ద్యోగులు వివిధ సమస్యలపై కలిసినా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రోజుల తరబడి కా ర్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వివరించారు. 

Updated Date - 2020-09-16T17:56:20+05:30 IST