ప్రత్యేక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులే నియామకం

ABN , First Publish Date - 2020-03-24T10:59:33+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులనే నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ పోలా

ప్రత్యేక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులే నియామకం

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 23 : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులనే నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా మండల స్థాయి అధికారులు ఉన్నారు.  వారికి అదనపు బాధ్యతలు ఉండడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ పంచాయతీ కార్యదర్శులకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులను ప్రత్యేక అధికారులుగా నియమించడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులను వేగవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Read more