అద్దంకి-దర్శి రోడ్డు అధ్వానం

ABN , First Publish Date - 2020-09-21T11:44:37+05:30 IST

అద్దంకి-దర్శి రోడ్డు అధ్వానం

అద్దంకి-దర్శి రోడ్డు అధ్వానం

గుండ్లకమ్మ బ్రిడ్జిపై గోతులు

మరమ్మతులు మూణ్ణాళ్ల ముచ్చటే..

వాహనచోదకుల ఇక్కట్లు


అద్దంకి, సెప్టెంబరు 20:  అద్ధంకి ప్రాంతంలో ప్రధాన రోడ్లు అధ్వానంగా మారి గోతులను తలపిస్తున్నాయి. అద్దంకి నుంచి దర్శి రోడ్డులో అద్దం కి నుంచి శంకరాపురం వరకు సుమారు 6 కిలోమీటర్ల దూరం రోడ్డు మరింత  దుస్థితికి  చేరిం ది.  అదే సమయంలో అద్దంకి నుంచి రేణింగవ రం రోడ్డు కూడా శిఽథిలావస్థకు చేరింది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. రాయ లసీమ జిల్లాలతో పాటు  ప్రకాశం జిల్లాలోని  పశ్చిమ ప్రాంతం నుంచి గుంటూరు, విజయవా డ, అమరావతి వెళ్ళేందుకు దర్శి, అద్దంకి మీదు గా జాతీయ రహదారికి చేరుకుంటున్నారు. దీం తో  దగ్గర మార్గంగా మారి వాహనాల రద్దీ మ రింత పెరిగింది. అయితే రోడ్డులో గోతులు ఉం డటంతో వర్షాలకు నీరు చేరి గుర్తించలేక వాహ న చోదకులు ప్రమాదాల బారిన  పడుతున్నారు. అద్దంకి-దర్శిరోడ్డులో పట్టణానికి సమీపంలో  గు ండ్లకమ్మ నది బ్రిడ్జి పై కూడా గోతులు ఏర్పడ్డా యి. దశాబ్ద కాలం క్రితమే బ్రిడ్జి కొంత భాగం కుంగటంతో మరమ్మతులు చేశారు. దీంతో వా హన చోదకులు భయంతో ప్రయాణిస్తున్నారు. ఇ క బ్రిడ్జి  వద్ద నుంచి  అద్దంకి పట్టణం వరకు వ ర్షపు నీరు మొత్తం రోడ్డు పైకి చేరుతుండటంతో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. కనీసం వాహనాలు కూడా వెళ్లే వీలు లేకుండా పోయింది. రోడ్డుకు మరమ్మతులు చేసి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాక ముందే మళ్లీ యథావిధిగా గో తులు పడ్డాయి. ఎన్నిసార్లు మరమ్మతులు చేసి నా కొద్ది రోజులకే యథాస్థితికి చేరుతుందని వా హన చోదకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించి రోడ్డు పునఃనిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.


రూ.50లక్షలతో ప్రతిపాదనలు 

అద్దంకి-దర్శి రోడ్డులో అద్దంకి నుంచి శంకరా పురం వరకు 6 కిలోమీటర్ల దూరం రోడ్డు తర చూ మరమ్మతులకు గురవుతోంది. మరమ్మతు లు చేసినా మళ్లీ గోతులు పడుతున్నాయి. రోడ్డు పునర్నిర్మాణానికి నిర్మాణానికి 50 లక్షల రూపా యలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. 

-భాస్కరరావు, ఏఈ, ఆర్‌అండ్‌బీ,  అద్దంకి

Updated Date - 2020-09-21T11:44:37+05:30 IST