ఘనంగా అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2020-12-20T05:47:49+05:30 IST
ఒంగోలు నగరం బండ్లమిట్టలో ఉన్న శ్రీవినుకొండ అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘ నంగా జరిగింది. ఇటీవల అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించారు.

ఒంగోలు కల్చరల్, డిసెంబరు 19: ఒంగోలు నగరం బండ్లమిట్టలో ఉన్న శ్రీవినుకొండ అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘ నంగా జరిగింది. ఇటీవల అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతు లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కంకణధారులుగా వైసీపీ నగర అ ధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, మీనాకుమారి దంపతులు వ్యవహరించా రు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో దాసరి నారాయణరావు, తనూజ, త్రిపురం మల్లి ఖార్జునరావు, పోకల రాజేష్ పాల్గొన్నారు.