-
-
Home » Andhra Pradesh » Prakasam » Amirica doctaret
-
పొదిలి వాసికి అమెరికా వర్సిటీ డాక్టరేట్
ABN , First Publish Date - 2020-12-29T05:18:45+05:30 IST
పొదిలికి చెందిన గంగవరపు రాజేంద్రపసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది.

పొదిలి, డిసెంబరు 28 : పొదిలికి చెందిన గంగవరపు రాజేంద్రపసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జిస్టేట్ యూనివర్సిటీ అట్లాంటా నుంచి డాక్టరేట్ పట్టా లభించింది. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం అమెరికాలోని రీజనల్ బ్యాంకులో సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన పొదిలిలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనిర్శిటీ నుంచి అర్ధశాస్త్రంలో ఎంఏ డిగ్రీ పట్టా పొందారు. ఆంధ్ర యూనివర్శిటీలో ఏంబీఏ చదివిన ఆయన బంగారు పతకం సాధించారు. డాక్టరేట్ పట్టా పొందిన రాజేంద్రప్రసాద్‌ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
(27కెఎన్‌జిపిఎంఆర్4)నెల్లూరు రోడ్డులో పగిలిన సాగర్ పైప్‌లైన్ పైపుల నుంచి లీకవుతున్న నీరు
సాగర్ పైపులకు తరచూ మరమ్మతులు
పామూరు, డిసెంబరు 28 : పామూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లే సాగర్ పైప్‌లైన్లు తరచూ మరమ్మతులకు గురౌతున్నాయి. దీంతో సాగర్ నీరు సక్రమంగా సరఫరా కాక ఆయా గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజుల నుంచి నెల్లూరు రోడ్డు స్వాగత్ లాడ్జి ఎదురు సాగర్ పైపులు పగిలిపోయి నీరంతా వృఽథాగా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో నీటి సరఫరాను సిబ్బంది నిలిపివేయడంతో నీరు నిలిచింది. తిరగలదిన్నె, కోడిగుడ్లపాడు, పామూరు, ఎన్జీవో కాలనీ వైపు నీరు సరఫరా లేక ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పైప్‌లైను పనులు చేసే క్రమంలోనే తగినంత ఇసుక పైపుల కింద వేయకపోవడంతో ఏ కొంచెం బరువు తగిలినా పైపులు పగిలిపోతున్నాయి. నెలలో ఒక సారి మండలంలోని ఎక్కడో ఒక చోట పైపులు మరమ్మతులకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పనులు నాణ్యతగా చేపట్టి నీటి వృథాను అరికట్టాలను ప్రజలు కోరుతున్నారు.