అంబేడ్కర్‌కు నివాళి

ABN , First Publish Date - 2020-12-07T04:57:43+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఆదివారం జిల్లావ్యాప్తంగా జరిగాయి. ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత, ప్రజా సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

అంబేడ్కర్‌కు నివాళి
ఎర్రగొండపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి సురేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ

ఒంగోలు, ఆంధ్రజ్యోతి ! రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఆదివారం జిల్లావ్యాప్తంగా జరిగాయి. ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత, ప్రజా సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎర్రగొండపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవన్‌, హెచ్‌సీఎం కళాశాల సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద కలెక్టర్‌ పోలా భాస్కర్‌ నివాళులర్పించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలోనూ కార్యక్రమాలు జరిగాయి.  

Read more