-
-
Home » Andhra Pradesh » Prakasam » all craffs loss by rains
-
అన్ని పంటలకూ నష్టమే..
ABN , First Publish Date - 2020-11-27T06:15:23+05:30 IST
అద్దంకి ప్రాంతంలో నివర్ తుపాను అతలాకుతలం చేస్తోంది. బుధ వారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం గురువా రం రోజంతా పడుతూనే ఉంది. దీంతో పంట పొ లాల్లో వర్షపు నీరు నిలిచింది.

అద్దంకి, నవంబరు 26 : అద్దంకి ప్రాంతంలో నివర్ తుపాను అతలాకుతలం చేస్తోంది. బుధ వారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం గురువా రం రోజంతా పడుతూనే ఉంది. దీంతో పంట పొ లాల్లో వర్షపు నీరు నిలిచింది. అద్దంకి, బల్లికురవ మండలాల పరిధిలో బోరు బావుల కింద ముం దుగా సాగు చేసిన వరి ప్రస్తుతం కోత దశలో ఉండటంతో పాటు పలువురు రైతులు కోసి ఓదె లు వేశారు. ఇంకొందరు వరి నూర్పిళ్లు చేసి వ డ్లను చేలల్లో కుప్పలు వేశారు. వీటిని కాపాడు కునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నా రు. మినుము పంట చేతికి వచ్చే దశలో వర్షార్ప ణం అయింది. వారంరోజులుగా సాగుచేసిన శ నగ, మొక్కజొన్నకు మొక్క వచ్చే అవకాశం లే దని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చే లల్లో పరిస్థితి అంతే. జూట్ పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లనుంది. కాగా తుపాను ప్రభా వంతో వీచిన గాలులకు అద్దంకి ప్రాంతంలో వి ద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మం డలాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప గలు, రాత్రి పలుసార్లు కరెంట్ రావడం, పోవడం తో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.
పంగులూరు : ఎడతెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలు రైతుల్లో గుబులు రేపాయి. మండ లంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన 550 హెక్టార్లలో మినుము కోత దశలో ఉండగా వర్షం తో నీటమునిగింది. ఖరీఫ్‌లో 4 వేలు, రబీలో 1000 ఎకరాల్లో మిరప సాగు చేయగా నష్టం త ప్పదని రైతులు నిరాశ చెందుతున్నారు.
మేదరమెట్ల: తుఫాను ప్రభావంతో కొరిశపా డు మండలంలో సాగుచేసిన పంటలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే నాటిన పొగాకు, మి నుము, శనగ పంటలతో పాటు మిరప పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.