-
-
Home » Andhra Pradesh » Prakasam » Adhar centers
-
ఆధార్ కేంద్రాల్లో అందని సేవలు
ABN , First Publish Date - 2020-12-29T04:43:50+05:30 IST
ఆధార్ నమోదు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు.

వినియోగదారుల ఇబ్బందులు
పామూరు, డిసెంబరు 28 : ఆధార్ నమోదు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. స్థానిక సబ్ పోస్టాఫీసులో ఆధార్ నమోదు చేసే యంత్రాలు మరమ్మతులకు గురికావడంతో గత 3 నెలల నుంచి ఆధార్ నమోదు నిలిచిపోయింది. దీంతో ఆధార్‌లో సవ రణలు, చేర్పులు, మార్పులు చేసే సౌకర్యం లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేక లబ్ధిదారులు నష్టపోతున్నారు. కరోనా కారణంగా మీసేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు నిలిపి వేశారు. దీంతో ఆధార్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌ కర్యానికి గురౌతున్నారు. మీసేవా కేంద్రాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను తిరిగి ప్రా రంభించేలా అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.