ఏసీబీ వలలో పెదఅలవలపాడు వీఆర్వో

ABN , First Publish Date - 2020-11-26T06:22:51+05:30 IST

మండలంలోని పెదఅలవలపాడు వీఆర్వో శివకాశయ్య ఏసీబీ వలకు చిక్కాడు. పొలం పాసు పుస్తకం మ్యూటేషన్‌కు రూ. 8వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.

ఏసీబీ వలలో   పెదఅలవలపాడు వీఆర్వో
వీఆర్వో శివకాశయ్య

పొలం మ్యూటేషన్‌కు లంచం డిమాండ్‌

రూ.8 వేలు తీసుకుంటూ పట్టుబడిన  వైనం

పీసీపల్లి, నవంబరు 25 : మండలంలోని పెదఅలవలపాడు వీఆర్వో శివకాశయ్య ఏసీబీ వలకు చిక్కాడు. పొలం పాసు పుస్తకం మ్యూటేషన్‌కు రూ. 8వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. సచివాలయంలోని రికార్డులు, మ్యూటేషన్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి  కథనం మేరకు.. పెదఅలవలపాడు సచివాలయానికి రెగ్యులర్‌గా, చౌటగోగులపల్లికి ఇన్‌చార్జి వీఆర్వోగా శివకాశయ్య పనిచేస్తున్నాడు. చౌటగోగులపల్లికి చెందిన గూడూరి సూజాత భర్త బ్రహ్మ య్య మృతి చెందాడు. అతని పేరుపై ఉన్న 0.41 సెంట్ల భూమిని సుజాత పేరున మ్యూటేషన్‌ చేయాల్సిందిగా దరఖాస్తు చేశారు. దరఖాస్తును పరిశీలించిన వీఆర్వో శివకాశయ్య రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. తన వద్ద అంత నగదు లేదని రూ.8వేలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకుంది. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని సుజాత విషయాన్ని తన కుమారుడు స్టీఫెన్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన స్పందన ద్వారా ఏసీబీకీ ఫిర్యాదు చేయడంతోపాటు, ఒంగోలులోని ఆశాఖ అధికారులను ఆశ్ర యించారు. వారి సూచన మేరకు  బుధవారం రూ. 8 వేల నగదును పెదఅలవల పాడు సచివాలయం వద్ద వీఆర్వో శివకాశయ్యకు అందజేశారు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదు పులోకి తీసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులు, మ్యూటేషన్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ సింగారావు, ఆర్‌ఐ పుల్లారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నరేష్‌లను విచారించి వారి  నుంచి పలు పత్రాలను తీసుకున్నారు. 

గతంలో దొరికినా మారని తీరు 

నాలుగు సంవత్సరాల క్రితం తర్లుపాడు మండలంలో వీఆర్వోగా పనిచేసిన శివకాశయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అనంతరం తిరిగి పోస్టింగ్‌ పొందిన అతను అలవాటును మార్చుకోలేదు. దీంతో మరోసారి ఏసీబీకి చిక్కాడు. ఈ దాడిలో ఏసీబీ  సీఐ ఎన్‌రాఘవేం ద్రరావు, ఎ.వెంక టేశ్వర్లు, ఎస్‌ఐ జేబీఎన్‌ ప్రసాద్‌ పాల్గొ న్నారు. Updated Date - 2020-11-26T06:22:51+05:30 IST