శింగరకొండలో ఆకాశదీప పూజ
ABN , First Publish Date - 2020-11-16T05:24:34+05:30 IST
శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వా మి ఆలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అద్దంకిటౌన్, నవంబరు 15: శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వా మి ఆలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా సాయంత్రం ధ్వజస్తంభం వద్ద శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావడంతో కార్తీక దామోదర ప్రీత్యర్ధం ఆకాశ దీపానికి పూజ నిర్వ హించారు. అనంతరం ధ్వజస్తంభానికి వేలాడదీశారు. ప్రసన్నాంజనే య స్వామి వారికి ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూ జలు నిర్వహించారు. గోపూజ, బిందెతీర్థం, విశ్వరూప సేవ అహాషేకా లు చేశారు. ఈ సందర్భంగా స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.