ఒంగోలు రైల్వేస్టేషన్‌లో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-04T03:38:32+05:30 IST

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడినసంఘటన గురువారం జరిగింది.

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో వివాహిత ఆత్మహత్య
వివాహిత మృతదేహం


ఒంగోలు(క్రైం), డిసెంబరు 3 : స్థానిక రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడినసంఘటన గురువారం జరిగింది. సుమారు 25 ఏళ్ల వివాహిత రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం ఉతర్త భాగాన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సత్రాగచి రైలు కింద తలపెట్టి చనిపోయింది. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. రైల్వే ఎస్‌ఐ వేమన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు పంజాబీ డ్రెస్‌ ధరించి ఉంది. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9440627647 సెల్‌ నంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

మరో ఘటనలో...

ఒంగోలు రాంనగర్‌ 10వ లైన్‌ వద్ద గల రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం ఛిద్రమైంది. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఎస్‌ఐ వేమన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Updated Date - 2020-12-04T03:38:32+05:30 IST