అంబేడ్కర్‌కు నివాళి

ABN , First Publish Date - 2020-04-15T11:08:34+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిరాడంబరంగా జరిగింది.

అంబేడ్కర్‌కు నివాళి

 ఒంగోలు కలెక్టరేట్‌:  రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిరాడంబరంగా జరిగింది. ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రజా, దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని మిరియాలపాలెం సెంటర్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి. నిరంజన్‌ రెడ్డి, మోప్మా పీడీ కాకి కృపారావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దయ్యాయి. 

Updated Date - 2020-04-15T11:08:34+05:30 IST