8.02 లక్షల పాఠ్య పుస్తకాలు సిద్ధం
ABN , First Publish Date - 2020-04-25T10:39:12+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా

వారం రోజుల్లో పంపిణీ పూర్తికి చర్యలు
డీఈవో సుబ్బారావు
ఒంగోలువిద్య, ఏప్రిల్ 24 : జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 8.02లక్షల పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసినట్లు డీఈవో వీఎ్‌స.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,02764పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 8,02,404 పుస్తకాలు ఒంగోలులోని ప్రభుత్వ పాఠపుస్తకాల డిపోకు చేరాయని, ఇంకా 360పుస్తకాలు మాత్రమే రావాల్సి ఉందన్నారు. 1 నుంచి 6తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు. జిల్లాకు చేరిన పాఠపుస్తకాల పంపిణీని డీఈవో ప్రారంభించారు. తొలిరోజు టంగుటూరు, కొత్తపట్నం మండలాలకు 28వేల పాఠ్య పుస్తకాలను పంపించారు. మరో వారం రోజుల్లో మిగిలిన మండలాలకు కూడా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం మొదటి విడత గ్రీన్‌జోన్ పరిధిలోని మండలాలకు మాత్రమే సరఫరా చేస్తామని, రెడ్, ఆరంజ్‌జోన్ పరిధిలోని మండలాలకు రెండో విడత పంపిణీ చేస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా మండలాలకు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో సుమారు 3లక్షలమంది విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఆందజేస్తున్నట్లు డీఈవో తెలిపారు. ఒకటో తరగతికి 20,044, రెండోతరగతి 29,156, మూడో తరగతికి 30,343, నాల్గుకు 31,146, ఐదుకు 31,131, ఆరుకు 25,155, ఏడుకు 30,296, ఎనిమిదికి 29,701, తొమ్మిదికి 28,715, పదికి 28,166 మందికి సరఫరా చేస్తామన్నారు.