ఆటోలు తిరిగితే కేసులు

ABN , First Publish Date - 2020-05-09T09:06:13+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో ప్రయాణికులను రవాణాచేయడం చట్టరీత్యా నేరమని నగర ఎన్‌ఫోర్సుమెంట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు.

ఆటోలు తిరిగితే కేసులు

70 ఆటోల సీజ్‌... డ్రైవర్లకు కౌన్సెలింగ్‌


ఒంగోలు(క్రైం), మే 8 : కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో ప్రయాణికులను రవాణాచేయడం చట్టరీత్యా నేరమని నగర ఎన్‌ఫోర్సుమెంట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలో ఉదయం 6 నుంచి 9 గంటలలోపు బయట తిరుగుతున్న 70 ఆటోలను సీజ్‌ చేశారు. ఆ తర్వాత స్థానిక డీఆర్‌ఆర్‌ఎం పాఠశాల ఆవరణలోకి తరలించారు. అక్కడ డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉందన్నారు. ఒన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.భీమానాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ రాఘవ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T09:06:13+05:30 IST