చుక్కలు చూపెడుతున్న సర్వర్‌

ABN , First Publish Date - 2020-11-26T06:31:25+05:30 IST

కార్డుదారులకు రేషన్‌ సరుకులు ఇచ్చేందుకు సర్వర్‌ అష్టకష్టాలు పెడుతోంది. ఉదయం 6గంటల నుంచే సాంకేతిక సమస్య తలెత్తుతోంది.

చుక్కలు చూపెడుతున్న సర్వర్‌
సర్వర్‌

తొమ్మిది రోజుల్లో 50.78శాతం మందికి మాత్రమే అందిన సరుకులు

రేషన్‌షాపుల్లో సర్వర్‌ను పరిశీలించిన డీఎస్‌వో

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 25 : కార్డుదారులకు రేషన్‌ సరుకులు ఇచ్చేందుకు సర్వర్‌ అష్టకష్టాలు పెడుతోంది. ఉదయం 6గంటల నుంచే సాంకేతిక సమస్య తలెత్తుతోంది. మధ్యాహ్నం నుంచి ఒకరకంగా సర్వర్‌ పనిచేసినా ఒక్కో కార్డుదారుకి సరుకులు ఇచ్చేందుకు 20 నిమిషాల సమయం పడుతోంది. జిల్లావ్యాప్తంగా 2,151 రేషన్‌షాపుల పరిధిలో 10.25లక్షల మంది కార్డుదారులు ఉండగా శుక్రవారం సాయంత్రానికి  50.78శాతం మందికి మాత్రమే సరుకులు అందాయి. మరో రెండురోజుల్లో 16వ విడత పంపిణీ ముగియనుండటంతో కార్డుదారులందరికీ ఆలోపు పూర్తిస్థాయిలో సరుకులు అందే పరిస్థితి కనిపించడం లేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఒంగోలు నగరంలోని పలు రేషన్‌ షాపులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌ తనిఖీ చేశారు. రేషన్‌షాపుల్లో సర్వర్‌ పరిస్థితిని పరిశీలించి డీలర్లకు పలు సూచనలు ఇచ్చారు.

Updated Date - 2020-11-26T06:31:25+05:30 IST