వైరస్ వణుకు
ABN , First Publish Date - 2020-06-18T10:41:56+05:30 IST
జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. కేసులు పెరిగిపోతున్నాయి. ఒకే రోజు అత్యధికంగా బుధవారం 24 పాజిటివ్‌లు

అత్యధికంగా ఒకే రోజు 24 కేసులు
దర్శిలో ఐదేళ్ల బాలుడికి కరోనా
మళ్లీ డేంజర్ జోన్‌లోకి ఒంగోలు
నగరంలో మరో 12 నమోదు
230కి చేరిన పాజిటివ్‌లు
ఒంగోలు నగరం, జూన్ 17 : జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. కేసులు పెరిగిపోతున్నాయి. ఒకే రోజు అత్యధికంగా బుధవారం 24 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలులోనే 12 ఉన్నాయి. మిగిలిన 12 జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో వెలుగు చూశాయి. మొత్తం కేసుల్లో 17 వీఆర్‌డీఎల్‌లో నిర్ధారణ కాగా ఏడు మాత్రమే ట్రూనాట్‌లో తేలాయి. ఒంగోలు నగరంలో గత వారం రోజులుగా నమోవుతున్న ప్రాంతాల్లోనే బుధవారం కూడా కేసులు బయటపడ్డాయి. మంగమూరు డొంకలో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పత్తివారివీధిలో ఒక కేసు నమోదైంది. మంగమూ రుడొంకలో ఇప్పటివరకు పాజిటివ్‌గా నమోదైన మహిళ ద్వారా ఈ ఐదుగురికి వైరస్ సోకింది. పత్తివారివీధిలో, కమ్మపాలెంలో, కర్నూల్‌రోడ్డులోని శ్రీనగర్ కాలనీ, నిర్మల్‌నగర్, వీఎన్ కాలనీల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవికాక మరో రెండు పాజిటివ్ కేసులు ఒంగోలుప్రాంతంలోనే వచ్చాయి. ఒంగోలులోని పత్తివారివీధిలో రెండు రోజుల క్రితం రేగిన కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. కొరిశపాడు మండలం రావినూతల్లో కూడా పాజిటివ్ కేసు నమోదైంది. కాగా రావినూతల్లో నెలరోజుల క్రితం పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం మళ్లీ కరోనా వెలుగుచూసింది. పీసీపల్లి మండలం పోతవరం లో మరో ఇద్దరికి పాజిటివ్ నమోదైంది. దర్శిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన వ్యక్తి నుంచి తల్లీబిడ్డకు సోకినట్లు తేలింది. బాలుడికి ఐదేళ్లు.
విజయవాడ నుంచి వచ్చిన యువకుడికి మార్కాపురంలో పాజిటివ్‌గా తేలింది. రాచర్ల మండలం చోళ్లవీడులో ముగ్గురికి కరోనాగా తేలింది. వీరిలో ఒక మహిళ ఇటీవల చెన్న్తె నుంచి గ్రామానికి రాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. చీరాలలోని జయంతిపేటలో మరో పాజిటివ్ కేసు వె లుగు చూసింది. జయంతిపేటలోనే ఇటీవల పాజిటివ్‌లు ఎక్కువగా నమోదు కాగా వారి ద్వారానే మరో మహిళకు కూడా సోకింది. జరుగుమల్లిలో మహిళకు పాజిటివ్ వచ్చింది. ఇంతకు ముందు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ద్వారానే ఈ మహిళకు కరోనా సోకినట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. కాగా పాజిటివ్‌గా తేలిన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లావ్యా ప్తంగా పలుచోట్ల కేసులు నమోదు కావటంతో ఆయా ప్రాంతాల్లోని వైద్యాధికారులు, పోలీసులు పాజిటివ్ వచ్చిన వారిని 108ల ద్వారా జీజీహెచ్‌కు తరలించారు. అనుమానితులుగా క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఒంగోలులో కలవరం
ఒంగోలు నగరంలో బుధవారం 12 కేసులు నమోదు కాగా ఇంకా మరికొన్ని బయటపడే అవ కాశం ఉందనేది సమాచారం. ఇవి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. పాజిటివ్ కేసులు నమోదైన పత్తివారివీధి, బండ్లమిట్ల ప్రాంతాల్లో ఇప్పటికే రాకపోకలను నిషేధించారు. కాగా బుఽధ వారం నగరంలోని పలుప్రాంతాల్లో కేసులు నమో దయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి రాకపోకలను నిషేధిం చారు. వ్యాపార, ఇతర దుకాణాలను మూసి వేయించారు.