తొలి రోజు 200 లీటర్లే

ABN , First Publish Date - 2020-11-21T06:02:18+05:30 IST

జిల్లాలో అమూల్‌ సంస్థ ద్వారా శుక్రవారం నుంచి పాలసేకరణ ప్రారంభమైంది.

తొలి రోజు 200 లీటర్లే

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20: జిల్లాలో అమూల్‌ సంస్థ ద్వారా శుక్రవారం నుంచి పాలసేకరణ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా పాలసేకరణ కోసం గురువారం అర్ధరాత్రి 69 క్యాన్లను పంపించారు. జిల్లాలోని రైతుభరోసా కేంద్రాల ద్వారా చేపట్టిన పాలసేకరణలో 200 లీటర్ల పాలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అమూల్‌ సంస్థ ద్వారా పాలసేకరణను అధికారింగా ప్రారంభించనుండటంతో జిల్లాలో ఈ ప్రక్రియను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి పాల సేకరణ చేపట్టారు. అయితే తొలిరోజు 200లీటర్ల పాలు మాత్రమే వచ్చాయి. శనివారం నుంచి 201 రైతుభరోసాకేంద్రాల ద్వారా పాల సేకరణను పూర్తిస్థాయిలో చేపట్టనున్నట్లు తెలిసింది. 


Read more