జిల్లాలో 16 క్వారంటైన్‌లు

ABN , First Publish Date - 2020-04-01T10:15:35+05:30 IST

జిల్లాలో కరోనా అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలను

జిల్లాలో 16 క్వారంటైన్‌లు

మూడువేల పడకల ఏర్పాటు 

698 మంది తరలింపు 


ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 31 : జిల్లాలో కరోనా అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలను పెంచారు.  ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఒక్కొక్కటి, మరో నాలుగు నియోజకవర్గాల్లో రెండు చొప్పున 16 ఏర్పాటు చేశారు. వాటిలో మూడు వేల బెడ్స్‌ను సిద్ధం చేశారు.


ఒక్కో కేంద్రంలో 100 నుంచి 500 మందిని ఉంచేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేంద్రానికి ఒక అధికారిని ఇన్‌చార్జిగా.. రెండు, మూడు కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారిని సూపర్‌ వైజర్‌గా నియమించారు. వారి సెల్‌నెంబర్లు కూడా ప్రకటించారు.  ఇప్పటి వరకూ వివిధ ప్రాంతాలకు చెందిన 698 మందిని క్వారంటైన్‌లలో ఉంచి పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2020-04-01T10:15:35+05:30 IST